‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్లాప్ కు కారణాలు చెప్పుకొచ్చిన నిర్మాత..!

దివంగత ముఖ్యమంత్రి, గొప్ప నటుడు అయిన ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యి ఘోర పరాజయాలను చవి చూసిన సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాల్లో ఎన్టీఆర్ జీవితంలో ట్రాజడీ ని చూపించకుండా.. ఎంతసేపు గొప్పోడు, మహానుభావుడు, మహానటుడు, దేవుడు అంటూ భజన చేయడంతోనే సినిమాలు అయిపోయాయి తప్ప ఎమోషనల్ టచ్ ఏమాత్రం లేదు అంటూ ప్రేక్షకులు విమర్శలు కురిపించారు. అయితే ఈ చిత్రం ఫలితం గురించి బాలకృష్ణ కానీ దర్శకుడు క్రిష్ గాని ఎవ్వరూ స్పందించలేదు.

అయితే నిర్మాతలలో ఒకరైన విష్ణువర్ధన్ తాజాగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ “ఎన్టీఆర్ బయోపిక్ ను తీసే అవకాశం మాకు రావడం నిజంగా గర్వకారణమే.! అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రేక్షకులు ఆశించిన ‘కీ’ పాయింట్ ఏదో మేము మిస్ చేసాము అనిపించింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తీసి వుంటే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేదేమో అనిపించింది. ఈ విషయంలోనే పొరపాటు చేసి ఉంటాము. ఏదేమైనా ఈ సినిమా ఖరీదైన గుణపాఠం నేర్పింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన కపిల్ దేవ్, జయలలిత బయోపిక్ లను కూడా రూపొందిస్తూ బిజీగా గడుపుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus