పారితోషికం పెంచాలని కోరుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే నటీనటులు

  • November 1, 2018 / 09:46 AM IST

మహానుభావుడు నందమూరి తారక రామారావు జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని వెండితెరపై మూడు గంటల్లో చూపించాలంటే చాలా కష్టం. అందుకే రెండు భాగాలుగా తీద్దామని తేజ చెప్పేసరికి బాలయ్య ఒప్పుకోలేదు. అతని తప్పుకున్న తర్వాత క్రిష్ ఒక సినిమాగానే మొదలెట్టారు. కానీ తీస్తున్నకొద్దీ ఇంకా సీన్స్ మిగిలే ఉన్నాయి. అందుకే రెండు భాగాలుగా చేయక తప్పలేదు. మొదటి పార్ట్ లో సినిమా లైఫ్ ని చూపించబోతున్నారు. ఇందుకు ‘కథానాయకుడు’ అనే అటైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ జనవరి 9 న రిలీజ్ కానుంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంలో చూపించనున్నారు. ఇందుకు మహానాయకుడు అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా జనవరి 24 న థియేటర్లోకి రానుంది. ఈ రెండు భాగాల్లో ఎన్టీఆర్ రోల్ పోషిస్తున్న బాలకృష్ణతో పాటు.. ఉండనున్న మరో వ్యక్తి విద్యాబాలన్. ఆమె ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో కనిపించనుంది.

ఇక ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రంలో నరేష్ నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. శ్రీదేవి పాత్రకోసం రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. అలాగే జయప్రద రోల్ కోసం మిల్క్ బ్యూటీ తమన్నాని తీసుకున్నారు. ఇలా భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతోన్న మూవీకి రెమ్యునరేషన్ సమస్య వచ్చింది. మొదట సంతకం చేసినప్పుడు ఒక సినిమా అన్నారు. ఇప్పుడు రెండు అయింది. డబల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆలోచించిన బాలకృష్ణ రెండు పారితోషికం కాకుండా పారితోషికాల్లో 50 శాతం పెంపుకు అంగీక‌రించాడ‌ని సమాచారం. అంటే ముందు ఒప్పుకున్న రెమ్యూనరేషన్లో సగభాగం అదనంగా ఇవ్వనున్నారు. బాలయ్య నిర్ణయాన్ని చిత్ర బృందం సంతోషంగా స్వాగతించిందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus