ఆ టైమ్ లో మాత్రం అభయ్ ని నేను కాపాడలేను

పిల్లలు మారాం చేస్తే ఎక్కువగా తండ్రి కోప్పడితే, తల్లి బుజ్జగిస్తుంటుంది. కానీ.. ఒక్కోసారి తండ్రి అమితమైన ప్రేమతో పిల్లల్ని దండించలేకపోతే ఆ బాధ్యతను తల్లి తీసుకొంటుంది. పాపం జూనియర్ ఎన్టీయార్ తనయుడు అభయ్ రామ్ విషయంలో అదే జరిగింది. కొడుకంటే విపరీతమైన ప్రేమతో అభయ్ ను ఎన్టీఆర్ అస్సలు ఏమీ ఆనలేడు. అందుకే అభయ్ తెగ మారాం చేస్తుంటాడు. అయితే.. అభయ్ అల్లరిని అన్నీ విషయాల్లో భరించే ప్రణతి.. బుడ్డోడు పాలు తాగనని మారాం చేస్తే మాత్రం ప్రణతి అస్సలు ఊరుకోదట. కొట్టకపోయినా.. కళ్ళతోనే భయపెడుతుందట. పాపం జూనియర్ ఎన్టీయార్ ఆ సమయంలో తనయుడికి ఎలాంటి సహాయం చేయలేక సైలెంట్ గా ఉండిపోతాడట.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తన అభిమానులకి తెలియజేశాడు. అమ్మ కంటి చూపుకి భయపడి పాలు తాగుతున్న అభయ్ రామ్ ఎంత ముద్దుగా ఉన్నాడో.. అమ్మ ప్రణతి అంతే ముద్దుగా కోప్పడుతుంది. ఇక ఫోటో తీసింది మన ఎన్టీయారే కాబట్టి ఆయన ఫోటోలో కనిపించలేదు. ఈ ఫోటో చూసిన అభిమానులు మాత్రం అభయ్ రామ్ బుజ్జితనం చూసి తెగ మురిసిపోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus