వైరలవుతున్న ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ వీడియో..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను.. ‘అద్భుతమైన నటుడు, కంప్లీట్ యాక్టర్, ఆల్ రౌండర్’ అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. అతను దేనినైనా సరే చాలా త్వరగా నేర్చుకుంటూ ఉంటాడు. అందుకే 18 ఏళ్ళకే స్టార్ అయ్యాడు. ఇప్పటికీ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో కష్టమైన డ్యాన్స్ మూమెంట్స్ ను కూడా ఎన్టీఆర్.. ఎంతో ఈజ్ తో చేసేస్తుంటాడు. అది కూడా కొరియోగ్రాఫర్ చెప్పిన కొద్దిసేపటికే నేర్చేసుకుంటుంటాడు.

అతను లావుగా ఉన్న రోజుల్లోనే యమ స్పీడ్ గా డ్యాన్స్ లు చేసేవాడు.’లావుగా ఉన్నాడు కదా.. ఇతనేం డ్యాన్స్ చేస్తాడు అని’ కామెంట్స్ చేసిన వారికి.. అతని డ్యాన్స్ తోనే సమాధానం చెప్తుండేవాడు.అయితే ‘యమదొంగ’ సినిమాలో సన్నబడిన తర్వాత ఎన్టీఆర్ మరింత స్పీడ్ గా డ్యాన్స్ లు చేసి ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్,మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కూడా ఎన్టీఆర్ డ్యాన్స్ ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇది పక్కన పెట్టేస్తే.. ఎన్టీఆర్ భరతనాట్యం కూడా నేర్చుకున్నాడన్న సంగతి తెలిసిందే. తన చిన్నప్పటి నుండీ క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు తారక్. ఆ అనుభవం వల్లనేనేమొ ఇప్పుడు సినిమాల్లో కూడా డ్యాన్స్ లు కుమ్మేస్తున్నాడని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా..ఎన్టీఆర్ చిన్ననాటి క్లాసికల్ డ్యాన్స్ వీడియో ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఎన్టీఆర్ డ్యాన్స్ చూస్తే అదరహో అనకుండా ఉండలరేమో. ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus