బిగ్ బాస్ సీజన్ 2 పై స్పందించిన ఎన్టీఆర్!

బిగ్ బాస్ షో రియాలిటీ ని తెలుగులో మొదలు పెడుతారు.. అనే వార్త బయటికి రాగానే అందరికి వచ్చిన డౌట్ ఉత్తరాది కల్చర్ ని తెలుగువారు అంగీకరిస్తారా? .. అని. ఆ షోకి హోస్ట్ గా ఎన్టీఆర్ చేస్తున్నారని ప్రకటించగానే.. హోస్ట్ గా తారక్ సెట్ అవ్వరు అన్నారు. ఆ విమర్శలన్నిటినీ ఎన్టీఆర్ తన మాటలతో తుడిచేసారు. ఇప్పుడు రెండో సీజన్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సారి హోస్ట్ గా నాని వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ స్థాయిలో నాని ఆకట్టుకోలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే షో రేటింగ్ లో వెనకపడిందని అంటున్నారు. దీనిపై ఎన్టీఆర్ నిన్న స్పందించారు.

“బిగ్‌బాస్‌” రెండో సీజ‌న్‌లో నాని చాలా బాగా చేస్తున్నాడు. అత‌ను మంచి న‌టుడు. ప్ర‌తీవారం నాని చెబుతున్న కాక‌మ్మ క‌థ‌లు బాగున్నాయి. బిగ్‌బాస్‌ అనేది తిరుగులేని ప్లాట్‌ఫామ్‌. వ్యాఖ్యాత‌గా ఎవ‌రు చేసినా ఆ కార్య‌క్రమం బాగానే ఉంటుంది” అని ఎన్టీఆర్ షో పై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సీజన్ వన్ కంటే సీజన్ 2 ఎక్కువకాలం కొనసాగనుంది. వందరోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి వీక్షకుల మనసులు గెలుచుకున్నవారు టైటిల్ సొంతం చేసుకుంటారు. సీజన్ వన్ లో శివబాలాజీ టైటిల్ గెలుచుకున్నారు.. మరి ఈ సీజన్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus