బాబాయ్ చిత్రం గురించి ఆరా తీసిన తారక్

నందమూరి కుటుంబంలో అభిప్రాయం భేదాలు తొలిగిపోతున్నాయి. అందరూ ఒకటిగా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు సంకల్పించుకున్నారు. కళ్యాణ్ రామ్, తారక్ కొన్ని రోజుల క్రితం కలిసిపోయి తండ్రి హరికృష్ణకు ఆనందాన్ని పంచారు. రీసెంట్ గా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎన్టీఆర్ ని కలిసి సలహాలు తీసుకున్నారు. నిన్న మరో అరుదైన సంఘటన జరిగింది. తారక్ డైరక్టర్ క్రిష్ కి ఫోన్ చేశారు. అందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే అసలు విషయం ఉంది. నటసింహా బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో సినిమా “గౌతమి పుత్ర శాతకర్ణి” ని క్రిష్ డైరక్ట్ చేస్తున్నారు. ఆ చిత్రం ఎలా రూపుదిద్దుకుంటోంది? అనే విషయాన్నీ క్రిష్ ని ఎన్టీఆర్ అడిగారట.

అంతేకాదు బాబాయ్ నటించిన యాక్షన్ సీన్స్ ని తొందరగా చూడాలని ఉందని చెప్పినట్లు తెలిసింది. అందుకు ఆనందించిన డైరక్టర్ ఎడిటింగ్ పూర్తి అయి, డబ్బింగ్ దశలో ఉన్న కొన్ని సీన్స్ ని త్వరలో చూపించనున్నాడని సమాచారం. ఇలా తారక్ నందమూరి కుటుంబ సభ్యులందరితో దగ్గరవుతున్నారు. ఈ జోరు చూస్తుంటే సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరైనా ఆశ్చర్యపోనవసరం లేదని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus