మొన్నీమధ్యే “నాన్నకు ప్రేమతో” సినిమా “సర్వీస్ ట్యాక్స్” విషయంలో అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఎన్టీయార్ కు ఆ సమస్య తీరే లోపే మరో తలనొప్పి నెత్తిమీద కూర్చుంది. ఎన్టీయార్ ఎంతో సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేస్తున్న “బిగ్ బాస్” షో కారణంగా కోర్ట్ నోటీసులు అందుకొన్నాడు. హైద్రాబాద్ కు చెందిన ఓ మానవ హక్కుల సంఘం మెంబర్ “బిగ్ బాస్” షోలో పాల్గొంటున్న పార్టీసిపేంట్స్ ను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కోర్ట్ మరియు పోలీసులకు తప్ప మరెవరికీ ఒక మనిషిని శిక్షించే హక్కు లేదని సదరు వ్యక్తి పేర్కొన్నారు.
నిజానికి.. “బిగ్ బాస్”కు కేవలం హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీయార్ కు ఈ కేస్ తో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. సదరు పిటిషన్ లో ఎన్టీయార్ పేరు కూడా పొందుపరచడం వల్ల ఎన్టీయార్ కూడా ఈ విషయంలో సమాధానం చెప్పాల్సి రావచ్చు. అయితే.. ఈ కేస్ విషయమై మాటీవీ సంస్థ ఎలాంటి కౌంటర్ వేస్తుందో చూడాలి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.