బిగ్ బాస్ షో కి శాపంగా మారిన ఎన్టీఆర్ ఇమేజ్!!

టాలీవుడ్ యంగ్ టైగర్…. తెలుగు తలైవా… ఎన్టీఆర్…టాలీవుడ్ లో దూకుడుగా పోతూ వరుస హిట్స్ తో హ్యాట్రిక్ సక్సెస్ సాధించాడు…అయిఎట్ త్వరలో జైలవకుశ గా టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించడానికి వస్తున్న యౌగ్ టైగర్ మరో పక్క బుల్లి తెరపై ‘బిగ్ బాస్’ షో లో బిజీగా గడుపుతున్నాడు…విషయంలికి వెళితే…ఈ బిగ్ బాస్ షో హిట్ ఆవాలి అంటే ఎన్టీఆర్ లాంటి హోస్ట్ అవసరం అనేది ఈ షో స్టార్ట్ కాక్ ముందు మాట…కానీ ఇప్పుడు ఈ షో ఫ్లాప్ కావడంతో అందరూ అసలు ఈ షో ఫ్లాప్ కి కారణమే ఎన్టీఆర్ ఇమేజ్ అంటున్నారు…అసలు విషయం ఏంటి అంటే….అత్యంత భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యప్రారంభం అయిన ‘బిగ్ బాస్’ షో ఊహించిన స్థాయిలో విజయవంతం కాకపోవడానికి ఒకవిధంగా జూనియర్ ఇమేజ్ కారణం అంటూ న్యూస్ చక్కెర్లు కొడుతుంది….అయితే ఎన్టీఆర్ ఇమేజ్ నే ‘బిగ్ బాస్’ షోకు శాపంగా మారిందా ? అంటే అవును అనే వాదన బలంగా వినిపిస్తుంది…దానికి కారణాలు ఏంటి అంటే…యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించబోతుండటంతో ‘బిగ్ బాస్’ షో భారీ సక్సస్ అవుతుందని చాలమంది అంచనా వేశారు. ‘బిగ్ బాస్’ షోకు సంబంధించి ఎన్టీఆర్ కనిపించిన ప్రోమోలు కూడా అట్రాక్టివ్‌ గా ఉండటంతో ఈకార్యక్రమం పై బుల్లితెర ప్రేక్షకుల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనితో ప్రేక్షకులు ఈకార్యక్రమం పై చాలఅంచనాలు పెట్టుకున్నారు.

అయితే. ఎన్టీఆర్ కనిపించినంతసేపు షోకు భారీ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ…జూనియర్ లేని సమయంలో మాత్రం ఈకార్యక్రమం ఎవ్వరికీ నచ్చడం లేదు అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి…దానికి అసలు కారణం ఏంటి అంటే….ఈ షోలో  పార్టిసిపెంట్స్‌లో ఏ ఒక్కరు ఆడియెన్స్‌ను మెప్పించేలా వ్యవహరించక పోవడం…అదే క్రమంలో వారందరూ పెద్దగా నేమ్ ఉన్న వాళ్ళు కాకపోవడం….న్యాచురల్ గా ఆక్ట్ చెయ్యలేకపోవడం ఇలా చాలా కారణాలే ఉన్నాయి…అయితే ఈ షో ఫ్లాప్ కావడం ఒక ఎత్తు అయితే….ఈ షో వల్ల జూనియర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉందని ఫాన్స్ చాలా బాద పడుతూ ఉన్నారు….ఎందుకంటే ఏకార్యక్రమం ఫెయిల్ అయినా దానికి ఆకార్యక్రమ హోస్ట్ బాధ్యత వహించాల్సి వస్తుందని ఇక్కడకూడా అదేజరిగి ఎన్టీఆర్‌పై ఆ ఎఫెక్ట్ పడుతుందేమోనని టెన్షన్ పడుతూ ఉన్నారు ఫాన్స్…మొత్తంగా చూసుకుంటే బుల్లి తెరపై ఎన్టీఆర్ హిట్ అయ్యాడు కానీ…ఆయన చేసిన షో మాత్రం కాదు అనేది ఒప్పుకోక తప్పని నిజం…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus