Jr NTR,Lakshmi Pranathi: ట్విట్టర్ లో ప్రణతి ఎంట్రీ.. లవ్లీ భర్త అంటూ?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారి క్రేజ్ అమాంతం పెంచుకునే విధంగా సోషల్ మీడియాలో ఖాతాలు ఓపెన్ చేసే రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే హీరోలు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోల సతీమణులు సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఇప్పటికే మెగా కోడలు ఉపాసన, అల్లు కోడలు స్నేహారెడ్డి, ఘట్టమనేని కోడలు నమ్రత వంటి వారు సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ జాబితాలోకి నందమూరి కోడలు, ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ఎంటరయ్యారు. ఈ క్రమంలోనే లక్ష్మీప్రణతి మొట్టమొదటిసారి ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.

పెళ్లయిన తర్వాత కొన్ని సినిమా ఫంక్షన్లలో సందడి చేసిన లక్ష్మీప్రణతి అనంతరం ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా బయట ప్రపంచానికి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఈమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవడం కోసం ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి మొదటి పోస్ట్ చేశారు. లక్ష్మీ ప్రణతి మొదటిసారిగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నేను కూడా మీ అందరితో పాటు ట్విట్టర్ లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

అదేవిధంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో అంటూ తన భర్త ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశారు. ఇలా లక్ష్మీ ప్రణతి ద్వారా సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎంతోమంది అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. ఈమె ట్విటర్ ఖాతా ఓపెన్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ ను దక్కించుకోవడం విశేషం.ఇలా గంటల వ్యవధిలోనే ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే ఇక పై సోషల్ మీడియాలో లక్ష్మీప్రణతి రచ్చ మామూలుగా ఉండదని తెలుస్తోంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus