డ్యాన్స్ విషయంలో మా హీరో బెస్ట్ అని కొట్టుకొంటున్నారు

  • November 30, 2019 / 04:54 PM IST

ఈ ట్విట్టర్లో జరిగే ఫ్యాన్ వార్స్ ఎంత సీరియస్ అనేది పక్కన పెడితే.. అవి క్రియేట్ చేసినంత ఫన్ ఒక్కోసారి జబర్దస్త్ షోస్ కూడా చేయలేవు. అలాంటి ఒక పనికిమాలిన ఫన్నీ ఇష్యు నిన్న ట్విట్టర్లో చోటు చేసుకుంది. మన టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్లుగా చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్ లు రేస్ లో ఉన్నారు. కానీ.. తమిళం నుంచి అద్భుతమైన డ్యాన్సర్ అనేవాళ్ళు చాలా తక్కువ. అక్కడ గత 20 ఏళ్లుగా విజయ్ ఒక్కడే సూపర్బ్ డ్యాన్సర్. అయితే.. యమదొంగ తమిళ వెర్షన్ తమిళంలో మొన్న విడుదలైంది.

అందులో ఎన్టీఆర్ డ్యాన్సులు వీరలెవల్లో ఉంటాయి. అది చూసి తట్టుకోలేకపోయిన కొందరు కుర్ర విజయ్ ఫాన్స్ ట్విట్టర్లో “ఎన్టీఆర్ కి డ్యాన్స్ రాదు.. విజయ్ అన్న ముందు ఎన్టీయార్ వేస్ట్” అని ఒక సోది ట్వీట్ వేసాడు. ఇంకొందరు వెర్రి విజయ్ అభిమానులు దాన్ని రీట్వీట్ చేసి నానా హడావుడి చేయగా.. కాస్త మెల్లగా రెస్పాండ్ అయిన ఎన్టీఆర్ ఫాన్స్.. ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్స్ స్టెప్స్ అన్ని కలిపి ఒక వీడియో చేసి.. ఇలాంటి డాన్స్ మీ విజయ్ చేయగలడా అని ట్వీట్ చేశారు. ఈ పనికిమాలిన ఫాన్స్ వార్ చూసి మిగతా హీరోల ఫాన్స్ అండ్ ట్విట్టర్ జనాలు తెగ నవ్వుకున్నారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus