మిర్చి మూవీ అవార్డ్స్ లో తారక్ కి వరించిన అవార్డులు!

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అప్పుడప్పుడు సింగ్ తుంటారు. అది కూడా తమ చిత్రాలకే పరిమితం. ఇతర హీరోలకు పాడడం అరుదు. ఆ సంప్రదాయాన్ని ప్రారంభించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తొలి ప్రయత్నంలోనే గొప్ప గాయకుడిగా నిరూపించుకున్నారు. తారక్ ఇది వరకు యమ దొంగ (ఓలమ్మి తిక్కరేగిందా), అదుర్స్ (వేరీజ్ పంచెకట్టు), నాన్నకు ప్రేమతో (ఫాలో ఫాలో ) సినిమాల్లో పాటలు పాడి అభిమానులను ఉర్రూతలూగించారు.

మొదటి సారి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా చక్ర వ్యూహా సినిమాకోసం గొంతు సవరించుకున్నారు. ఆ చిత్రంలో అయన పాడిన “గెలయా గెలయా .. గెలువే నమదయ్యా ” పాట కన్నడీయులకు విపరీతంగా నచ్చింది. ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన ఈ సాంగ్ ఎక్కువమంది ఆదరించిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంకేముంది బెస్ట్ సింగర్ గా ఎన్టీఆర్ కు అవార్డు లభించింది. నిన్న జరిగిన మిర్చి మ్యూజిక్ అవార్డు వేడుకలో ఈ అవార్డును తారక్ అందుకున్నారు. కన్నడ కేటగిరీలోనే కాకుండా తెలుగు సింగింగ్ స్టార్ సెన్సేషన్ కేటగిరిలో నాన్నకు ప్రేమతో  “ఫాలో ఫాలో” పాటకు మరో అవార్డును సొంతం చేసుకున్నారు. జనతా గ్యారేజ్ విజయంతో ఆనందంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు ఈ అవార్డులు మరింత సంతోషాన్ని కలిగించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus