తారక్, మోక్షజ్ఞ కలయికతో నందమూరి అభిమానుల్లో ఆనందం

నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞని వెండి తెరపైన చూసుకునేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాల‌య్య వందో సినిమా గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో మోక్ష‌జ్ఞ కనిపిస్తాడని మొదట్లో వార్తలు వచ్చినా అందులో వాస్తవం లేదని తేలడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. కారణం ఏమిటని ఆరా తీస్తే అనేక సంగతులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుని హైదరాబాద్ కి వచ్చిన మోక్షజ్ఞ జ‌న‌తా గ్యారేజ్ సినిమా చూసి.. అందులో తారక్ నటన అదిరిపోయిందని, చాలా బాగా చేసావని అన్నని కలిసి చెప్పాడంట.

ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య కొంత దూరం ఉంది. ఆ సంగతిని పక్కన పెట్టి మోక్షజ్ఞ తారక్ ఇంటికి వెళ్లి అన్నతో కలిసి ఎక్కువసేపు మాట్లాడారని తెలిసింది. అప్పుడే తమ్ముడికి అన్న కొన్ని పాఠాలు భోదించినట్లు సమాచారం. కథ ఎంపికపై పలు జాగ్రత్తలను సూచించారట. ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు మనవళ్లు ఒకటి కావడంపై అభిమానుల్లో అనందం వెల్లివిరిసింది. వారిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఖాయమని ఇప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus