ఎన్టీఆర్ కన్నా పవన్ కళ్యాణ్ లో ఉన్న గొప్ప ఏమిటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేర్చుకోవాలా? .. అని అడిగితే.. అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నటన, డ్యాన్స్ లో కాదు. ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినప్పుడు మడమ తిప్పకూడదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ కంటే పవన్ గ్రేట్ అని కితాబు ఇస్తున్నారు. ఈ టాపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చిందంటే తారక్ ఐదేళ్లక్రితం డైరక్టర్ అవకాశం ఇస్తానని రచయిత వక్కంతు వంశీ కి మాట ఇచ్చారు. అతను ఎన్టీఆర్ కి తగిన స్టోరీని రాసారు. బయట అవకాశాలు వచ్చినా తారక్ సినిమాతో దర్శకునిగా పరిచయం కావాలని ఆశతో అన్ని వదులుకున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత తనతోనే అనుకున్న వంశీ కి ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చారు. కథలో కొన్ని సీన్లు బాగాలేవని పక్కన పెట్టారు.

ఈ విషయంపై వక్కంతు వంశీ బయట ఎక్కడ చెప్పడం లేదు కానీ అతనికి జరిగిన నష్టాన్ని సినీ పరిశ్రమలో అందరూ చెప్పుకుంటున్నారు. కొత్త డైరక్టర్ అనే భయం తో ఎన్టీఆర్ వంశీ తో సినిమా చేయడానికి వెనకడుగు వేసాడని విమర్శిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మాట ఇస్తే తప్పడని.. గోపాల గోపాల చిత్రం అప్పుడు సరదాగా ఆయన చెప్పిన సంగతి గుర్తుపెట్టుకుని డాలీ తో కాటమ రాయుడు సినిమా తీస్తున్నారని వివరించారు. అలాగే ఖుషి నిర్మాత ఏ.ఎం.రత్నం కి పదేళ్లక్రితం ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో సుస్వాగతం తీసిన భీమినేని శ్రీనివాస్ కి పవన్ ఇమేజ్ పెరిగినప్పటికీ ఇచ్చిన మాట కోసం అతనితో అన్నవరం సినిమా చేశారని తెలిపారు. అలా పవన్ ప్రొఫిషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ల్లో మాట మీద నిలబడతారని, ఈ విషయంలో పవన్ నుంచి తారక్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఫిల్మ్ నగర్ వాసులు స్పష్టం చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus