2023 సంవత్సరంలో ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయా?

నందమూరి హీరోలు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. 2023 జనవరిలో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి థియేటర్లలో రిలీజ్ కానుండగా బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ కూడా వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుందని సమచారం. 2023 జూన్ నుంచి బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

వరుస ప్రాజెక్ట్ లతో బాలయ్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా 2023 సంవత్సరం ప్రత్యేకం కానుంది. తారక్ ఒకే సమయంలో అటు కొరటాల శివ డైరెక్షన్ లో ఇటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించనున్నారని సమాచారం. కొరటాల తారక్ కాంబో మూవీ 2023లో రిలీజ్ కానుండగా ప్రశాంత్ నీల్ తారక్ కాంబో మూవీ 2024లో రిలీజ్ కానుందని బోగట్టా.

ఇకపై కెరీర్ విషయంలో ఏ మాత్రం గ్యాప్ రాకుండా తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. కొరటాల శివ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని తారక్ బలంగా నమ్ముతున్నారు. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీతో 2023లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో బింబిసార మ్యాజిక్ ను రిపీట్ చేస్తానని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

2023 సంవత్సరంలో బింబిసార2 సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ రానుందని బోగట్టా. 2023 సంవత్సరంలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కూడా ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. 2023 సంవత్సరం నందమూరి ఫ్యాన్స్ కు స్పెషల్ ఇయర్ గా నిలిచిపోయే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాలు 2, కళ్యాణ్ రామ్ సినిమాలు 2, తారక్ సినిమా ఒకటి వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. మొత్తం ఐదు సినిమాలతో నందమూరి హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారని సమాచారం.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus