ఎన్టీఆర్ కథానాయకుడు ఫ్లాప్ అయినందుకు బాలయ్య ఎంత బాధపడుతున్నాడో తెలియదు కానీ.. ఆ సినిమాను అత్యధిక ధరలకు కొన్నందుకు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం భీభత్సంగా బాధపడుతున్నారు. దాదాపు 71 కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఈ సినిమా కనీసం 21 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో సినిమాకి దాదాపు 50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి బదులుగా బాలయ్య సెకండ్ పార్ట్ అయిన “ఎన్టీఆర్ మహానాయకుడు” రైట్స్ ఫ్రీగా ఇచ్చేశాడనుకోండి.
ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే మాత్రం ఈరేంజ్ హిట్ టాక్ వచ్చిన సినిమాకి ఇలాంటి కలెక్షన్సా అని అందరు షాక్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్.
నైజాం: 3.90 కోట్లు
సీడెడ్: 1.80 కోట్లు
వైజాగ్: 1.98 కోట్లు
ఈస్ట్: 1.14 కోట్లు
గుంటూరు: 2.90 కోట్లు
కృష్ణ: 1.40 కోట్లు
వెస్ట్: 1.35 కోట్లు
నెల్లూరు: 90 లక్షలు
ఏపీ &టీఎస్: 15.37 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా:1.50కోట్లు
ఓవర్సీస్: 3.75 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 20.62 కోట్లు