ఈవారంలో ఎన్టీఆర్ సినిమా వసూలు చేసింది ఇంతేనా

భారీ అంచనాలు, ఆశల నడుమ విడుదలైన “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రానికి సూపర్ హిట్ టాక్ & పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాను భారీ ధరలకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు తీవ్రమైన నష్టం తెచ్చిపెట్టిన సినిమా “ఎన్టీఆర్ కథానాయకుడు”. తన తండ్రి పాత్రను బాలయ్య పోషించి మరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దాదాపు 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ చిత్రం ఇప్పటివరకూ కనీసం 20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది.

ఏరియా వైజ్ ఈవారం రోజుల్లో ఎన్టీఆర్ కథానాయకుడు ఎంత కలెక్ట్ చేసిందో చూడండి..

వైజాగ్: 1.50 కోట్లు
ఈస్ట్: 0.82 కోట్లు
వెస్ట్: 1.05 కోట్లు


కృష్ణ: 1.31 కోట్లు
గుంటూర్: 2.71 కోట్లు
నెల్లూరు: 0.81 కోట్లు


నైజాం: 3.80 కోట్లు
సీడెడ్: 1.60 కోట్లు
కర్ణాటక: 1.15 కోట్లు
ఓవర్సీస్: 2.85 కోట్లు

మొత్తం: 18.5 కోట్లు

సో, సినిమాకి కనీసం 50% రెమ్యూనరేషన్ అయినా రికవరీ అవ్వాలంటే కనీసం ఇంకో మూడు వారాలపాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిస్తే తప్ప పాజిబుల్ అయ్యే అవకాశం లేదు. అందుకే రెండో భాగమైన “ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి ఈ జాగ్రత్తలు కలెక్షన్స్ పరంగా ఏమైనా హెల్ప్ అవుతాయో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus