Jr NTR: బల్లెంతో కొమరం భీమ్.. లుక్ వైరల్!

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. దీంతో ఈ సినిమా ఇక వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవుతుందనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేశారు.

వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ.. ”వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్” అంటూ రామ్ చరణ్ వాయిస్ తో రిలీజైన టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఇక ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్ ను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.

ఎన్టీఆర్ బల్లెం పట్టుకొని గురి చూస్తూ విసరడానికి సిద్ధమయ్యే స్టిల్ ను వదిలారు. ఈ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఎన్టీఆర్ గెటప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొమరం భీమ్ గురి తప్పదంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను రూ.400 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్యే నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ కనిపించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus