యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టి దాదాపుగా 26 సినిమాలు పూర్తి చేశాడు, అయితే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అపజయాలు, అయినా ఎక్కడా వెనుకడుగు వెయ్య లేదు ఎన్టీఆర్. అయితే అదే క్రమంలో పూర్తి ఊర మాస్ హీరోగా మారిపోయిన ఎన్టీఆర్ క్లాస్ హీరోగా సైతం నిలదొక్కుకోవాలి అన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు. అదే క్రమంలో తాజాగా వచ్చిన జనతా గ్యారేజ్ విషయంలో ఎన్టీఆర్ నటనకు దాసోహం అంటుంది తెలుగు ప్రేక్షక ప్రపంచం. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ అనే చెప్పాలి ఎన్టీఆర్….ఈ సినిమా ఎన్టీఆర్ వరకూ చాలా స్పెష్యాలిటీస్ ఉన్నాయి…ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫర్స్ట్ హాఫ్ అంతా పక్కా క్లాస్ గా కనిపిస్తాడు…ఇక సెకెండ్ హాఫ్ లో కాస్త మాస్ టచ్ ఇస్తాడు.
ఆ రెండు పాత్రల్లోనూ ఏదో తెలియని కొత్తదనం కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హడావిడి, ఆరవడాలు, తొడగొట్టి గర్జించడాలు ఏమీ లేకుండా…యంగ్ టైగర్ చెప్పే చిన్న చిన్న డైలాగులు వాటి ప్రజెంటేషన్ అద్భుతహ! ఈ సినిమా ఏస్థాయి హిట్టు అనే విషయం కాసేపు పక్కనపెడితే… నటుడిగా మాత్రం జూనియర్ మరో మెట్టు ఎక్కాడనడంలో సందేహం లేదనే చెప్పాలి. ఇక ముఖ్యంగా ఎన్టీఆర్ మోహన్ లాల్ మధ్య వచ్చే సీన్స్ లో ఎన్టీఆర్ తన నటనతో అందరినీ మరిపించేసాడు. ఎదురుగా మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్ ఉన్నాకూడా ఎంతో కాన్ఫిడెంటుగా నటించి మెప్పించినందుకు ఎన్టీఆర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంకా పక్కాగా చెప్పాలి అంటే….ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్…ముఖ్యంగా రాజీవ్ కనకాల ఎపిసోడ్…చూస్తే…ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకటని చెప్పుకుని తీరాల్సిందే. ఏది ఏమైనా…ఎన్టీఆర్ ఆదరగోడుతున్నాడు.