పవన్ కళ్యాణ్ సినిమా గురించి సంచలన కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే ఇష్టపడని వారు ఉండరు. అతని సినిమాలంటే హీరోలతో సంబంధం లేకుండా థియేటర్లు నిండిపోతుంటాయి. గురూజీ అని పిలుచుకునే అతన్ని విమర్శించేలా చేసిన మూవీ అజ్ఞాతవాసి. పక్కా హిట్ అనుకున్న మూవీ రివర్స్ ఫలితాన్ని ఇచ్చింది. ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అనగానే నందమూరి అభిమానులు కంగారు పడ్డారు. తమ హీరో ఫ్లాప్స్ నుంచి బయటపడి ఇప్పుడే విజయాలను అందుకుంటున్నారు. వరుసగా నాలుగు హిట్స్ కొట్టారు.. ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా తీసి మళ్ళీ అపజయాల బాట పడతాడేమోనని ఆందోళన పడ్డారు. మరి అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసేటప్పుడు అజ్ఞాతవాసి ప్రభావం తన సినిమాపై ఉంటుందని అనుకున్నారా? అని ఎన్టీఆర్ ని ప్రశ్నించగా అతను ఇలా స్పందించారు.

”అజ్ఞాత‌వాసి ప్ర‌భావం త్రివిక్ర‌మ్‌పై ఉంటుంద‌ని నేను అనుకోను. సినిమాల‌నేవి ఓ ప్ర‌యాణం. అందులో హిట్స్ ఉండొచ్చు, ఫ్లాప్స్ ఉండొచ్చు. నాకు లేవా ఫ్లాపులు…??. ఒత్తిడి అనేది త్రివిక్ర‌మ్‌గారిపైనే కాదు.. అంద‌రిపైనా ఉంటాయి. కానీ ఓ సినిమా ఆ స్థాయిలో ప్ర‌భావితం చేస్తుంద‌ని నేను భావించ‌ను. “అర‌వింద స‌మేత‌” అనేది పూర్తిగా త్రివిక్ర‌మ్ సినిమా. ఆయ‌న ప్ర‌యాణంలో నేను భాగ‌మ‌య్యానంతే. అంతేగానీ నా ప్ర‌యాణంలో త్రివిక్ర‌మ్ భాగం కాదు. “అర‌వింద‌”లో అన్ని పాత్ర‌ల్నీ చాలా అద్భుతంగా రాశారాయ‌న‌” అంటూ ఎన్టీఆర్‌ ప్రసంశలు గుప్పించారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఈనెల 11 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus