విదేశాలకు ట్రిప్ వేసిన ఎన్టీఆర్, మహేష్, శర్వానంద్!

  • October 4, 2017 / 05:18 PM IST

“వారం ఐదునాళ్లు శ్రమకే జీవితం.. వారం రెండు నాళ్ళు ప్రకృతికి అంకితం” అంటూ జీన్స్ సినిమాలో కొలంబస్ కొలంబస్ పాటలో చెప్పినట్లు ఎంజాయ్ చేయడం హీరోలకు కుదరదు. వారి లైఫ్ టైం టు టైం అని ఉద్యోగస్థుల్లా కాకుండా కొంత డిఫెరెంట్ గా ఉంటుంది. సినిమా పూర్తి అయ్యేవరకు రెస్ట్ లేకుండా పనిచేయడం.. రిలీజ్ అయిన తర్వాత రిలాక్స్ అవ్వడం సినీ స్టార్ లైఫ్ స్టైల్. అదే విధంగా ఇప్పుడు ఎన్టీఆర్, మహేష్, శర్వానంద్ లు హాలీడే మూడ్ లో ఉన్నారు. అటు బిగ్ బాస్ షో, ఇటు జై లవకుశ షూటింగ్ ఈ రెండూ పనులతో రెండు నెలలుగా తీరిక లేకుండా పనిచేశారు ఎన్టీఆర్. బిగ్ బాస్ షో బుల్లి తెరపై సంచలనం సృష్టించింది. అలాగే జై లవకుశ మూవీ వారానికి వందకోట్లు కలెక్ట్ చేసి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించింది.

సో ఎన్టీఆర్ ఆనందంతో తన భార్య, తనయుడితో కలిసి ఓ నెల రోజుల పాటు విదేశీ విహారానికి పయనమయ్యారు. వచ్చిన తర్వాత త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనుల్లో ఎంటర్ కానున్నారు. ఇక మహేష్ కూడా ఏడాది పాటు స్పైడర్ కోసం కష్టపడ్డారు. కోలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ కూడా వందకోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే పిల్లలు, పెళ్ళాంతో కలిసి మహేష్ స్విర్జర్ల్యాండ్ కి వెళ్లారు. రెండు రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. శర్వానంద్ కూడా దసరా బరిలో దిగారు. మహానుభావుడు గా వచ్చి నవ్విస్తున్నారు. అతను కూడా అమెరికా ట్రిప్ ప్లాన్ చేశారు. కొన్ని రోజులు రిలాక్స్ అయి నెస్ట్ సినిమాని మొదలు పెట్టనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus