బాలీవుడ్ నటులకు రిఫరెన్స్ గా ఎన్టీఆర్ సినిమాలు

  • February 22, 2017 / 07:26 AM IST

మహా నటుడు నందమూరి తారక రామారావుకి భారతీయ సినీ పుస్తకంలో కొన్ని అధ్యయాలు ఉంటాయి. ఎన్టీఆర్ నటన ఎంతోమందికి స్ఫూర్తి. మహానటుడి సినిమాలను యాక్టింగ్ స్కూల్ ల్లో పుస్తకాలుగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు చేయాలంటే అందరూ చూడమనేది ఎన్టీఆర్ సినిమాలనే. ఆ మహా నటుడు అన్ని రకాల పౌరాణిక పాత్రలు పోషించి అదరగొట్టారు. అందుకే భాషా బేధం లేకుండా  పౌరాణికాల విషయంలో ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుంటారు. ఈ సంగతిని తాజాగా ఠాకూర్ అనూప్ సింగ్ మరోసారి గుర్తుచేశారు. మిస్టర్ ఇండియా, మిస్టర్ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచిన ఇతను తమిళ స్టార్ హీరో సూర్య యాక్షన్ మూవీ ఎస్ 3 ద్వారా దక్షిణాదికి పరిచయమయ్యారు.

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ విన్నర్ మూవీలోనూ విలన్ గా నటించారు. తొలుత బుల్లి తెరలో అడుగుపెట్టిన ఠాగూర్ ‘మహాభారతం(హిందీ)’లో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించారు. ఆ పాత్ర చేసే ముందు తెలుగులో ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలు చూడమని అక్కడి డైరక్టర్లు అతడికి సలహాలిచ్చారట. “ఎన్టీఆర్ సినిమాలు చాలా చూశాను. అవి నాకు రెఫరెన్సుగా బాగా ఉపయోగపడ్డాయి. మహా నటుడి నుంచి ఎంతో నేర్చుకున్నాను” అని ఠాగూర్ సింగ్ చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus