యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం కొంచెం బరువు పెరిగాడు. దాని తర్వాత చేసిన ‘దేవర’ లో ఓ రోల్ కోసం కూడా అదే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఆ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ ‘వార్ 2’ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందే మూవీ. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.
అయాన్ ముఖర్జీ దర్శకుడు. 2019 లో వచ్చిన ‘వార్’ పెద్ద హిట్ అయ్యింది. అందుకే ‘వార్ 2’ కి మంచి హైప్ ఉంది. పైగా ఎన్టీఆర్ (Jr NTR) ఇందులో భాగం కావడం వల్ల ఈ సీక్వెల్ పై అంచనాలు మరింతగా పెరిగాయి అని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ (Jr NTR) కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్లో కనిపిస్తాడు అని టాక్. బాలీవుడ్ జనాలకి మరింత దగ్గరయ్యేందుకు ఎన్టీఆర్ చేస్తున్న ప్రయత్నం ఇది.
[VEEGAM_Poll id=”7″]
అలాగే ఈ పాత్రలో ఎన్టీఆర్ మరింత స్లిమ్ గా కనిపించాల్సి ఉంది. అందుకోసం జిమ్ములో బాగా కసరత్తులు చేసి స్లిమ్ అయ్యాడు. అతని లేటెస్ట్ ఫోటో చూస్తే.. ఇది నిజమే అని స్పష్టమవుతుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తాడు. ఆ సినిమాలో పాత్ర కోసం ఎన్టీఆర్ కొంచెం బరువు పెరగాల్సి ఉందని తెలుస్తుంది.
అయితే ముందుగా ‘వార్ 2’ కంప్లీట్ అయితేనే కానీ.. ఇప్పట్లో ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ కష్టం. హృతిక్ కాలికి గాయం అవ్వడంతో ‘వార్ 2’ లేటెస్ట్ షెడ్యూల్ ఆగిపోయింది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.