Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ‘దేవర’ అనే పాన్ ఇండియా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ తో ఈ సినిమా రూపొందింది. 2024 సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట్లో ఈ సినిమా పై అంచనాలు లేవు. సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది.

Devara 2

అయితే సోలో రిలీజ్ దక్కడం.. ఈ సినిమాకి 2 నెలల ముందు గానీ తర్వాత గానీ మరే పెద్ద సినిమా రాకపోవడంతో ‘దేవర’ కి బాగా కలిసొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ పొందింది. తర్వాత కూడా మాస్ సెంటర్స్ లో బాగానే నిలబడింది. అలా మొత్తంగా ‘దేవర’ కమర్షియల్ గా గట్టెక్కేసింది అని చెప్పాలి.ఇదిలా ఉండగా.. ‘దేవర’ కి సెకండ్ పార్ట్ ఉంటుందని రిలీజ్ కి ముందే దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు.

సినిమా క్లైమాక్స్ లో కూడా సీక్వెల్ కి అవసరమైన లీడ్ ఇచ్చారు కూడా. అయితే ఇప్పటివరకు సీక్వెల్ పనులు మొదలు కాలేదు. వాస్తవానికి జనవరిలోనే ‘దేవర 2’ షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ఎందుకో ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ‘దేవర 2’ ఉండదు అంటూ ప్రచారం జరిగింది. దీంతో స్వయంగా ఎన్టీఆర్ రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ‘ ‘దేవర 2’ కచ్చితంగా ఉంటుంది.. అందులో ఎలాంటి డౌట్ వద్దు. దర్శకులు ప్రశాంత్ నీల్ గారితో సినిమా పూర్తయిన వెంటనే ‘దేవర 2′ చేస్తాను’ అంటూ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది.

రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus