యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆఫీస్ వద్ద సందడి నెలకొని ఉంది. యువ రచయితలు, నూతన దర్శకులతో అతని కార్యాలయం బిజీ అయింది. వరుసగా వచ్చిన విజయాలతో తారక్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. కొత్త లైన్ తో రూపొందిన కథతో సినిమా చేయడానికి ఉత్సాహంగా వివిధ స్టోరీలను వింటున్నారు. సీనియర్, జూనియర్ అని భేదం లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తానని ఎన్టీఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో యువ రచయితలు కథలు పట్టుకొని తారక్ ఆఫీస్ కి వస్తున్నారు.
ఇప్పటికే వక్కంతు వంశీ, పూరి జగన్నాథ్, అనిల్ రావి పూడి, లింగుస్వామి, చందు మొండేటితో సహా 8 మంది దర్శకులు ఎన్టీఆర్ కి కథలు విపించారు. వీటిలో ఏది యూనిక్ గా అనిపించక పోవడంతో వాటిపై ఆసక్తి కనబరచలేదు. తనని ఎగ్జైట్మెంట్ కలిగించే స్క్రిప్ట్ కోసం ఓపికగా ఆఫీస్ లో కూర్చుంటున్నారు. డైరక్టర్ ని కాకుండా కథను చూసి ఒకే చెప్పడానికి నిర్ణయించుకున్న ఎన్టీఆర్ ని పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నాను. అతనిలో వచ్చిన మార్పును స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల టాలీవుడ్ లో వినూత్న కథలతో సినిమాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.