యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖర్చు చేసే వయసులోనే సంపాదించారు. 19 ఏళ్ల వయసులోనే “ఆది” చిత్రంతో కోట్లు కురిపించారు. ఇలా అతని సంపాదన 20వ ఏటా నుంచే కోట్లతో మొదలయింది. సింహాద్రి సినిమాతో టాప్ హీరోల సరసన చేరిన ఈ నందమూరి హీరో అప్పటి నుంచే భారీ రెమ్యునరేషన్ అందుకోవడం మొదలు పెట్టారు.15 ఏళ్ల సినీ కెరీర్ లో అనేక విజయాలను సొంతం చేసుకున్న తారక్, తాజా చిత్రం జనతా గ్యారేజ్ కు 20 కోట్లు తీసుకున్నారు.
ఇటు సినిమాల ద్వారానే కాకుండా అప్పుడప్పుడు పలు కంపెనీల ప్రకటనల్లో నటించి బాగానే సంపాదించారు. 2011 లో లక్ష్మి ప్రణతిని వివాహమాడిన ఎన్టీఆర్ ఆమె ద్వారా 250 కోట్ల ఆస్తిని పొందారు. ఇక తన తండ్రి నుంచి వారసత్వంగా 454 కోట్లు వచ్చింది. ధన, బంగారు రూపేనా 800 కోట్లు కలిగిన ఎన్టీఆర్ మహాబలిపురం , హైదరాబాద్, ఫిలిం నగర్ ప్రాంతాల్లో భూములను కలిగి ఉన్నారు. ఇది ఇప్పటి మార్కెట్ ధరతో లెక్కిస్తే 200 కోట్లు విలువ చేస్తుంది. స్థిరాస్తి తో పాటు బీఎం డబ్లవ్యూ కారు, పలు బెంజి కార్లు వంటి చరాస్తుల విలువ కొన్ని కోట్లు ఉంటుందని సమాచారం. సో.. తారక్ వెయ్యికోట్లకు మించి ఆస్తులు కలిగిన శ్రీమంతుడన్న మాట.