మెగా, నందమూరి అభిమానులని ఫిదా చేస్తున్న వీడియో..!

రాజమౌళి డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, డైసీ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గుజరాత్ లోని వడోదర ప్రాంతంలో జరుగుతుంది. ఇదిలా ఉండగా… మెగా,నందమూరి అభిమానులను ఖుషీ చేసేలా ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఈ చిత్ర షూటింగ్ కు రెడీ అవుతున్న సమయంలో చరణ్ ఓ స్కూటీ పై తారక్ బస్సు ఉన్నదగ్గరకి వచ్చాడు. అంతే అప్పటి వరకూ డ్రైవ్ చేస్తూ ఉన్న చరణ్ వెనక్కి జరిగి కూర్చుండగా… ఎన్టీఆర్ స్కూటీ ఎక్కి డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు. అంతే సరదాగా వాళ్ళిద్దరూ ఆ స్కూటీ పై షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోయారు. ఈ వీడియో చూస్తుంటే వీరి స్నేహం ఎలా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus