Jr Ntr: వార్ 2 కోసం కెరీర్ హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ “వార్ 2”తో చేయడం అనేది మొదట్లో అవసరమా? అనిపించిన విషయం. ఎందుకంటే హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ తేలిపోతాడు!, సరైన స్థాయి ఎలివేషన్ ఉండదు! అంటూ రకరకాల అనుమానాలు వినిపించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పుట్టినరోజుకి విడుదల చేసిన టీజర్ కి ఆ అనుమానాలు మరింత ఆజ్యం పోశాయి. పుట్టినరోజు ఎన్టీఆర్ ది అయినప్పటికీ.. టీజర్ లో ఎక్కువ షాట్స్ & ఎలివేషన్ హృతిక్ కే ఉండడం అనేది ఎన్టీఆర్ అభిమానుల్ని నిరాశపరచగా, మిగతా వాళ్లందరూ ముందే చెప్పాం కదా అన్నట్లు కామెంట్ చేసారు.

Jr Ntr

కట్ చేస్తే.. ట్రైలర్ తో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. చెప్పాలంటే హృతిక్ కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ షాట్స్ పడ్డాయి. ఇక ఎలివేషన్ అయితే మాములుగా లేదు. కట్ చేస్తే.. గత కొన్నిరోజులుగా “వార్ 2” సినిమాకి హృతిక్ కంటే ఎన్టీఆర్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో మేటర్ ఏంటంటే.. రెమ్యునరేషన్ పరంగా హృతిక్ కంటే ఎన్టీఆర్ ఎక్కువ తీసుకోవడం అనేది నిజమే. హృతిక్ ఈ చిత్రం కోసం 50 కోట్లు తీసుకోగా.. ఎన్టీఆర్ 60 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

బహుశా సీనియర్ హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ మరో నటుడు తీసుకోవడం అనేది ఈ జనరేషన్ లో ఇదే మొదటిసారి. అయితే.. ఎన్టీఆర్ ప్లే చేసిన పాత్రకు చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని, ట్రైలర్ లో కనిపించేదానికంటే భిన్నమైన షేడ్ లో ఎన్టీఆర్ షాక్ ఇస్తాడని తెలుస్తోంది. అందుకునే ఈ రెమ్యూనరేషన్ హైక్ అని కూడా సమాచారం. ఆగస్ట్ 14న విడుదలవుతున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి కానీ.. “కూలి” ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అనే విషయం మాత్రం కొంచం టెన్షన్ కలిగిస్తుంది అభిమానులకి.

కీరవాణిపై థంబ్‌నైల్స్‌.. ఏం జరిగిందో చెప్పి కౌంటర్‌ ఇచ్చిన వశిష్ఠ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus