ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు పరిశీలనలో రెండు పేర్లు

జై లవ కుశ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ శివారులలో పూర్తి అయింది. యాక్షన్ సీన్ చిత్రీకరించారు. త్వరలో రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయనున్నారు. నాలుగు కోట్లతో రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన సెట్ ని అక్కడ నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి టైటిల్ ఇదే నంటూ వార్త గుప్పుమంది. “అసామాన్యుడు”, “సింహ నంద” అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

“అసామాన్యుడు” టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉందని టాక్. జిగేల్ రాణి పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతమందిస్తున్నారు. జగపతిబాబు విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో అలనాటి హీరోయిన్స్ కీలకపాత్రలు పోషించనున్నారు. తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్న ఈ చిత్రం అక్టోబర్ లో థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus