మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటుడిగా కొనసాగుతూ నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టారు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని స్థాపించి ఖైదీ నంబర్ 150 మూవీని నిర్మించి సక్సస్ ఫుల్ నిర్మాతగా అనిపించుకున్నారు. ఇప్పుడు తాను సుకుమార్ దర్శకత్వంలో హీరోగా చేస్తూ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండో మూవీని కూడా తండ్రి చిరంజీవితోనే తీస్తుండడం విశేషం. అయితే బడా హీరోలతోనే కాకుండా.. యువ హీరోలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో చెర్రీ ఉన్నారు. మెగాస్టార్ మూవీ పూర్తి అయిన తర్వాత శర్వానంద్, అఖిల్ తో చిత్రాలను చేయనున్నారు. ఇందుకు స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
ఈ రెండు సినిమాల తర్వాత ఓ క్రేజీ ప్రాజక్ట్ చేపట్టాలని చరణ్ భావిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పెట్టి భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేయాలనీ ఆశపడుతున్నారు. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలయికలో తెరకెక్కనున్న ఈ మూవీ రికార్డులను తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ తన మిత్రుడు ఎన్టీఆర్ తో ఈ విషయాన్నీ త్వరలోనే చెప్పి ఒకే చేయించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఆ శుభముహుర్తం కోసం నందమూరి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.