Pranathi, Anjana: ఒకే చోట చేరి సందడి చేస్తున్న ఎన్టీఆర్ నాని సతీమణులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం కోసం పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే స్టార్ట్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి భార్యలు పిల్లలు కూడా ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. అయితే ఇలాంటి వాటన్నింటికీ ఎన్టీఆర్ దూరంగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సైతం సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటారు.

ఎన్టీఆర్ కేవలం తన సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకోగా లక్ష్మీ ప్రణతి మాత్రం ఏదైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు లేదా కుటుంబ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో మనకు కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటారనే చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈమె నటుడు నాని భార్య అంజనాతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాని భార్య అంజనా ప్రణతి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇక వీరిద్దరి మధ్య రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి సమయంలో పరిచయం ఏర్పడి అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ తరచూ వారి స్నేహితులతో కలుస్తూ ఉంటారు.

ఇలా నాని భార్యతో కలిసి ప్రణతి దిగినటువంటి ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన తారక్, నాని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తారక్, నాని ఇద్దరు కూడా పలు సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

1

2

3

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus