Jr NTR: ఎన్టీఆర్30 మూవీకి ఈ హీరోయిన్ ఫైనల్ కానుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో మూవీ అని వార్తలు ప్రచారంలోకి వచ్చిన సమయంలో మొదట ఈ సినిమాలో కియారా అద్వానీ పేరు హీరోయిన్ గా వినిపించింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి కియారా అద్వానీని పరిచయం చేసిన డైరెక్టర్ కొరటాల శివ కావడంతో ఈ సినిమాలో కియారా అద్వానీనే హీరోయిన్ గా ఫైనల్ అవుతుందని చాలామంది భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ తర్వాత అలియా భట్ పేరు వినిపించింది.

అలియా భట్ సైతం ఈ సినిమాలో తాను నటిస్తున్నానని కన్ఫామ్ చేసి ఊహించని విధంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో ఎంతోమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినా బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ఎంపిక చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే ఎన్టీఆర్ కు సరైన జోడీని ఎంపిక చేయడంలో మేకర్స్ విఫలవుతున్నారు. చివరకు కియారా అద్వానీనే ఈ సినిమాలో ఎంపికైందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట వినిపించిన పేరునే చివరకు ఫైనల్ చేశారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ కియారా అద్వానీ జోడీ బాగుంటుందని అభిమానులు సైతం భావిస్తున్నారు. అయితే మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే కియారా అద్వానీ ఈ సినిమాలో నిజంగా నటిస్తారో లేదో తెలియనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఆగష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

వేగంగానే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. యంగ్ టైగర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus