NTR30: ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఎన్టీఆర్30 రికార్డులు క్రియేట్ చేస్తుందా?

  • March 25, 2023 / 03:39 PM IST

(NTR30) ప్రతి సినిమాకు సంబంధించి కొన్ని సెంటిమెంట్లను ఫాలో కావడం జరుగుతుంది. ఆ సెంటిమెంట్ల వల్ల సినిమాలు హిట్టైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సెంటిమెంట్లు సినిమాలకు సంబంధించి ముందే రిజల్ట్ ను డిసైడ్ చేస్తాయి. ఒక సెంటిమెంట్ ప్రకారం ఎన్టీఆర్30 మూవీ బ్లాక్ బస్టర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో పని చేశారు.

1 నేనొక్కడినే సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ కాగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో మూవీ తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ఫ్యాన్స్ కు తెగ నచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో జై లవకుశ తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకులను అంచనాలను మించి ఆకట్టుకుంది.

అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత సినిమా కూడా అంచనాలను మించి మెప్పించింది. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజమౌళి సెంటిమెంట్ మాత్రం ఎన్టీఆర్30 మేకర్స్ ను ఒకింత టెన్షన్ పెడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. పాదఘట్టం అనే పదం ఎక్కువసార్లు వాడటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ కొరటాల శివ తర్వాత సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించాలని భావిస్తున్నారు. 80 శాతం సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ తర్వాత సినిమాలతో ఆ సక్సెస్ రేటును పెంచుకుంటానని భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus