తమిళంలో తెరకెక్కడానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్ మరో మూవీ

తమిళంలో హిట్ అయిన చిత్రాలను తెలుగు వారు రీమేక్ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ అలవాటు మారుతోంది. కొత్త దర్శకులు వినూత్న కథలతో సినిమాలను రూపొందిస్తుండడంతో ఇక్కడ సినిమాలు తమిళంలో రీమేక్ అవుతున్నాయి. రీసెంట్ గా తెలుగు విజయం సాధించిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 .. వంటి అనేక సినిమాలు తమిళంలో సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటి సినిమాలనే కాకుండా రెండేళ్ల క్రితం కథలను కూడా తీయడానికి ఆసక్తికనబరుస్తున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ చిత్రాలకి మంచి గిరాకీ ఉందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన టెంపర్ చిత్రాన్ని అయోగ్య పేరుతో విశాల్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు యంగ్ టైగర్‌కు సంబంధించిన మరో మూవీ తమిళ్‌లో రీమేక్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కి మంచి హిట్ సాధించిన మూవీ నాన్నకు ప్రేమతో. ఈ చిత్రం తమిళ్‌లో రీమేక్ చేయడానికి పనులు మొదలయ్యాయని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఓ స్టార్ హీరో ఈ కథలో నటించబోతున్నట్టు వెల్లడించారు. భారీ ధరకు కథ హక్కులను సొంతం చేసుకున్నారని డైరక్టర్ ఫిక్స్ కాగానే అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ కథలు మాస్ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతాయి. అందుకే కోలీవుడ్ దర్శకనిర్మాతలు తారక్ సినిమాలవైపే చూస్తున్నట్టు సమాచారం. మరి ఈ రెండు సినిమాలు హిట్ అయితే మిగతా వాటికీ మరింత డిమాండ్ రావడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus