“అరవింద సమేత” ఆడియో వేడుకని ఎందుకు క్యాన్సిల్ చేశారు?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆ పాటలను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. ఈనెల 20 న హైదరాబాద్ లోని “నోవాటెల్” హోటల్లో నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావించారు. ఈ వేడుకకి నటసింహ బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్టు ప్రచారం సాగింది. అయితే ఈ వేడుకని క్యాన్సిల్ చేసినట్లు తెలిసింది. కారణం ఏమిటని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అదియే వేడుక కాకుండా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాలని డిసైడ్ అయినట్టు తెలిసింది.

అక్టోబర్ 11 న సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి… అక్టోబర్ మొదటివారంలో ఈ వేడుకని నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. డేట్ ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.      పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా గెస్ట్ రోల్ పోషించారని టాక్. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ లో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus