మన తెలుగు సినిమా హీరోహీరోయిన్లు సినిమాల్లో ఎంత అద్భుతంగా నటిస్తారో తెలియదు కానీ.. ప్రెస్ మీట్స్, ఆడియో లాంచ్ ఈవెంట్స్ అండ్ సక్సెస్ మీట్స్ లో మాత్రం నేషనల్ అవార్డ్ స్థాయిలో నటిస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా.. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రిలీజ్ కి ముందు సినిమా మీద విపరీతమైన హైప్ పెంచేస్తుంటారు. కానీ.. మొన్న జరిగిన “జై లవకుశ” ఆడియో వేడుకలో మాత్రం ఎన్టీయార్ పదే పదే “ఇది కాకపోతే ఇంకోటి” అనే పదం వాడడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
సినిమాపై ఎక్కువ హైప్ క్రియేట్ చేసి.. రిజల్ట్ తేడాగా ఉంటే అభిమానులు ఒక్కసారిగా సీరియస్ అయిపోయి రియాక్ట్ అవ్వడం మంచిది కాదనే భావనతోనే.. సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ను ఎక్కువగా పెంచకుండా, సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటున్నాడు ఎన్టీయార్. మరి నిజంగానే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచకూడదు అనే అలా అన్నాడా లేక సినిమా రిజల్ట్ మీద డౌట్ ఉందా అనేది సినిమా రిలీజయ్యాక అర్ధమవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.