‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రెండో వారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కుమ్మేసే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ రన్ కి కూడా ఢోకా ఉండకపోవచ్చు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘పుష్ప’ సినిమా కథ ఎక్కడ నుండి మొదలైందో అందరికీ తెలిసిందే. పుష్ప రాజ్ కి ఇంటి పేరు లేకుండా చేస్తారు అతని సవతి అన్నలు. అందుకే అతనే ఓ బ్రాండ్ అవ్వాలనుకుంటాడు, అవుతాడు.
Allu Arjun
సెకండ్ పార్ట్ లో తన భార్య ప్రెగ్నెంట్ అయితే.. తనకు ఆడపిల్లే పుట్టాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్టు పుష్ప చెప్పి కన్నీళ్లు పెట్టిస్తాడు. క్లైమాక్స్ లో అతని అన్న అజయ్ వచ్చి అతని కూతురి పెళ్ళి శుభలేఖలో పుష్పరాజ్.. ఇంటి పేరు మొల్లేటి అని రాయిస్తాడు. ఆ సీక్వెన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మొత్తంగా పుష్ప సినిమా ఇంటి పేరు ఎంత ముఖ్యమైనదో తెలుపుతుంది. అందుకు సుకుమార్ (Sukumar) ని అభినందించాల్సిందే.
అయితే హీరో అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ ఇంటి పేరు మర్చిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విషయం ఏంటంటే.. ఈరోజు పుష్ప 2 సక్సెస్ మీట్ ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అక్కడ అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తూ.. ‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ బండి సుకుమార్ రెడ్డికి చెందుతుంది ‘ అంటూ చెప్పడం అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే దర్శకుడు సుకుమార్ పూర్తి పేరు బండ్రెడ్డి సుకుమార్. కానీ బన్నీ మాత్రం బండి సుకుమార్ రెడ్డి అంటూ చెప్పాడు.
అల్లు అర్జున్ కి లైఫ్ ఇచ్చింది సుకుమార్. ఈ విషయాన్ని బన్నీ చాలా సార్లు చెప్పాడు. అలాంటిది లైఫ్ ఇచ్చినోడి పూర్తి పేరు తెలుసుకోకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పైగా ఇప్పుడు తీసిన ‘పుష్ప’ ‘పుష్ప 2’ .. కూడా ఇంటి పేరు చుట్టూ తిరిగే కథతో తీసినవి. అందుకే నెటిజన్లు అల్లు అర్జున్..ని అలా ట్రోల్ చేస్తున్నారు అని స్పష్టమవుతుంది.