మలయాళంలో ‘రావణాసురన్’ గా రిలీజ్ కానున్న జై లవకుశ

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీఆర్ తొలిసారి నటించిన సినిమా జై లవకుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తారక్ నటవిశ్వరూపం చూపించారు. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన ప్రసంశలు అందుకుంది. అందుకే ఈ మూవీ తెలుగురాష్ట్రాల్లో కలక్షన్ల వర్షం కురిపించింది. వరుస అపజయాలతో ఇబ్బందుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మలయాళంలో డబ్బింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. జనతా గ్యారేజ్ ద్వారా ఎన్టీఆర్ కి మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

ఆ సినిమా మలయాళంలోను ఎన్టీఆర్ మార్కెట్ ను పెంచేసింది. దాంతో ‘జై లవకుశ ‘ సినిమాను కూడా మలయాళ ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతున్నారు. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన జై పాత్రకు సంబంధించిన రావణా సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అందువలన రావణ పాత్రను హైలైట్ చేస్తూ మలయాళంలో ఈ సినిమాను “రావణాసురన్” పేరుతో విడుదల చేయనున్నారు. కేరళ బ్యూటీ నివేదా థామస్ అభిమానులు సైతం ఈ చిత్రం చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ కేరళలో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus