ఎన్టీఆర్ రెండో కొడుకుని చూసి మురిసిపోతున్న అభిమానులు!

“నా కుటుంబం ఇంకా పెద్దదవుతోంది”.. తనకి రెండో కొడుకు పుట్టిన ఆనందంలో ఎన్టీఆర్ నోటి వెంట వచ్చిన తొలి మాటలివి. మనసులోతుల్లోంచి వచ్చిన ఆ మాటల్లో చాలా భావం ఉంది. తాను హరికృష్ణకు కొడుకుగా పుట్టినప్పటికీ నందమూరి ఫ్యామిలీకి చాలా కాలం దూరంగానే పెరిగారు. తోడబుట్టినవారు ఎవరూలేరు. సో దాదాపు ఒంటరిగానే ఎదిగారు. ఒక్కడే కష్టపడి తెలుగురాష్ట్రాల నిండా అభిమానులను సొంతం చేసుకున్నారు. తనలాగా తన పెద్ద కొడుకు అభయ్ రామ్ ఒంటరిగా పెరగకూడదు అనుకున్నారామె.. పూజలు చేశారో తెలియదు గానీ ఆ దేవుడు ఎన్టీఆర్ కి రెండో కొడుకుని ప్రసాదించాడు. గురువారం లక్ష్మి ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

రెండో రోజే అభిమానుల కోసం తన చిన్న కుమారుడు ఫోటోని ఎన్టీఆర్ షేర్ చేసారు. ఆ బాబు ఫోటోని చూసి కుటుంబ సభ్యులు, అభిమానులు మురిసిపోతున్నారు. ఎంత ముద్దొస్తున్నాడో అంటూ అభినందనలు కురిపిస్తున్నారు. తెగ లైక్ లు కొడుతున్నారు. షేర్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఆనందకర క్షణాలను మిస్ కాకూడదనే బిగ్ బాస్ సీజన్ 2 అవకాశాన్ని తారక్ వదులుకున్నారు. దగ్గరుండి ఇద్దరుకొడులని చూస్తూ గడుపుతున్నారు. ఎల్లుండి నుంచి అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ కోసం పొల్లాచి కి వెళ్లనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus