Nuvve Kavali Collections: 21 ఏళ్ళ ‘నువ్వేకావాలి’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Advertisement

2000 వ సంవత్సరం అక్టోబర్ 13న విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈరోజుతో ఆ చిత్రం విడుదలై 21 ఏళ్ళు పూర్తికావస్తోంది. ‘ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్’ పై రామోజీరావు గారు నిర్మించిన ఈ చిత్రానికి కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సంభాషనలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. 1999లో వచ్చిన ‘నీరం’ అనే మలయాళం చిత్రానికి ఇది రీమేక్. తరుణ్- రిచా జంటకి మంచి మార్కులు పడ్డాయి. అలాగే కోటి అందించిన సంగీతం ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.35 cr
సీడెడ్ 2.80 cr
ఉత్తరాంధ్ర 1.79 cr
ఈస్ట్ 1.43 cr
వెస్ట్ 1.27 cr
గుంటూరు 1.56 cr
కృష్ణా 1.33 cr
నెల్లూరు 0.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  0.81 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 19.20 cr

‘నువ్వే కావాలి’ చిత్రానికి కేవలం రూ.1.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.19.20 కోట్లు షేర్ ను నమోదు చేసింది. డబ్బింగ్ కు సంబంధించిన కలెక్షన్ల వివరాలు కాకుండా ఈ లెక్కలు.అవి కూడా కలుపుకుంటే రూ.20 కోట్లు పైగానే ఉంటాయని ట్రేడ్ పండితుల అంచనా. అదే ఏడాది ఇండస్ట్రీ హిట్ అయిన ‘కలిసుందాం రా’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘నువ్వేకావాలి’ చిత్రం. కానీ ఈ కలెక్షన్లను 2001 లో వచ్చిన బాలయ్య.. ‘నరసింహ నాయుడు’ చిత్రం బ్రేక్ చేసేసింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus