Nuvvu Nenu: రీ రిలీజ్ అవుతున్న ఉదయ్ కిరణ్ మూవీ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే?

  • March 20, 2024 / 11:50 AM IST

ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో నటించిన చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలు నిర్మాతలకు సైతం ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి. ఉదయ్ కిరణ్ మరణించి చాలా సంవత్సరాలే అయినా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ హృదయాలలో మాత్రం ఉదయ్ కిరణ్ జీవించే ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమాకు బుకింగ్స్ మాత్రం ఆశించిన రేంజ్ లో లేవు.

భారీ సంఖ్యలో థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్నా ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ లేకపోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సరైన ప్రమోషన్స్ లేకుండా రీ రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అవుతోంది. కొన్ని జిల్లాలలో ఈ సినిమా కేవలం ఒకటి రెండు షోలు మాత్రమే ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. బుకింగ్స్ బాగుంటే షోలు, థియేటర్ల కౌంట్ పెరిగేది.

మరికొన్ని రోజుల్లో ఈరోజుల్లో, మగధీర (Magadheera) సినిమాలు రీ రిలీజ్ కానుండగా ఈ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. రీ రిలీజ్ సినిమాలు మినిమం గ్యాప్ తో థియేటర్లలో విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నువ్వు నేను సినిమాకు ఆఫ్ లైన్ బుకింగ్స్ అయినా బాగుంటాయేమో చూడాల్సి ఉంది. నువ్వు నేను సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నిషియన్లు వీడియో బైట్స్ వదిలినా ఈ సినిమా బుకింగ్స్ పుంజుకుంటాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నువ్వు నేను (Nuvvu Nenu) సినిమా రీరిలీజ్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. అయితే ఉదయ్ కిరణ్ వీరాభిమానులు మాత్రం ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉదయ్ కిరణ్ నటించిన మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus