పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్స్టర్ డ్రామా ‘ఓజి’, సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. 2,3 ఏళ్ళ నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్ తో ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.
దీంతో ట్రేడ్లో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 55.5 cr |
సీడెడ్ | 20 cr |
ఉత్తరాంధ్ర | 21 cr |
ఈస్ట్ | 11 cr |
వెస్ట్ | 10 cr |
గుంటూరు | 12 cr |
కృష్ణా | 10 cr |
నెల్లూరు | 5.5 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 145 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 10 cr |
ఓవర్సీస్ | 18 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 173 (షేర్) |
‘ఓజి’ చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి భారీ హైప్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా..బ్రేక్ ఈవెన్ అనేది కేక్ వాక్ అనే చెప్పాలి. టికెట్ హైక్స్ కూడా ఉన్నాయి కాబట్టి.. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.