‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి 6 సినిమాలు ప్లాపులు అవ్వడంతో శర్వానంద్ రేసులో కాస్త వెనక్కి పడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో ‘ఒకే ఒక జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది అతనికి 30వ సినిమా కావడం విశేషం.! నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది.
‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ సో సో గానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 3.80 cr |
సీడెడ్ | 2.10 cr |
ఉత్తరాంధ్ర | 1.80 cr |
ఈస్ట్ | 0.80 cr |
వెస్ట్ | 0.68 cr |
గుంటూరు | 1.05 cr |
కృష్ణా | 0.71 cr |
నెల్లూరు | 0.46 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.40 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.60 cr |
ఓవర్సీస్ | 0.50 cr |
హిందీ మరియు ఇతర వెర్షన్లు | 1.20 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 13.70 cr |
‘ఒకే ఒక జీవితం’ చిత్రానికి రూ.13.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. శర్వానంద్ గత 4,5 చిత్రాలు రూ.10 కోట్ల షేర్ మార్క్ ని దాటలేకపోయాయి. ఈ క్రమంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మౌత్ టాక్ పాజిటివ్ గా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!