షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఒక్క అమ్మాయి తప్ప’..!

సందీప్ కిషన్, నిత్యా మీనన్ లు జంటగా నటిస్తున్న చిత్రం ‘ ఒక్క అమ్మాయి తప్ప’. దాదాపు 70 శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని..

పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లోకి ఎంటరైంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రాజసింహ తాడినాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిక్కీ జె మేయర్  స్వరాలు సమకూరుస్తుండగా.. బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరోవైపు ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags