Om Bheem Bush Collections: ‘ఓం భీమ్ బుష్’ 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీవిష్ణు(Sree Vishnu),ప్రియదర్శి(Priyadarshi) , రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush). ‘హుషారు’ (Husharu)  ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు కలిసి నిర్మించగా…, ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ సమర్పిస్తుంది. మార్చి 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది.

ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించింది. అయితే రెండో వీకెండ్ కి ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)  రావడం వల్ల కొంచెం కలెక్షన్స్ తగ్గాయి. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.95 cr
సీడెడ్ 0.53 cr
ఉత్తరాంధ్ర 0.57 cr
ఈస్ట్ 0.29 cr
వెస్ట్ 0.24 cr
గుంటూరు 0.46 cr
కృష్ణా 0.55 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.79 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.96 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.75 cr (షేర్)

‘ఓం భీమ్ బుష్’ చిత్రానికి రూ.6.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.7.75 కోట్లు షేర్ ను రాబట్టింది. మొత్తంగా మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.0.96 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus