Prabhas: ‘ఆదిపురుష్‌’పై ఓం రౌత్‌ క్లారిటీ.. చూద్దాం!

‘ఆదిపురుష్‌’ అంటే పురాణాల నేపథ్య కథ అని సులభంగా తెలిసిపోతుంది. ఏవన్నా చిన్న చిన్న డౌట్స్‌ ఉంటే… సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు కొన్ని క్లియర్‌ చేసేశారు. ఈ సినిమా రామాయణం ఆధారంగానే తెరకెక్కుతోందని చెప్పేశారు. పాత్రధారుల పేర్లు కూడా చెప్పేశారు. అయితే ఇప్పటికీ సినిమా రంగంలో ఓ చిన్న డౌట్‌ ఉంది. రామయణాన్ని ఉన్నది ఉన్నట్లు తీస్తున్నారా? లేక… ఏమైనా మార్పులు చేస్తున్నారా? అని ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్‌ దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు.

కొంతమంది అనుకుంటున్నట్లు ‘ఆదిపురుష్‌’ కోసం కాస్త స్వేచ్ఛ తీసుకున్నామని, అయితే అది ఇతిహాసాన్ని మార్చేలా ఉండదు అని చెప్పారు ఓం రౌత్‌. లిబర్టీ పేరుతో చాలామంది చరిత్రను తమకు నచ్చినట్లుగా మార్చి చూపిస్తున్న రోజులివి. నేనైతే అలాంటి పని చేయలేదు. జరిగినదాన్ని, జరిగింది అని చెబుతున్న దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడాన్ని లిబర్టీ అని నేను అంటాను. అంతేకానీ పురాణాన్నలి మార్చడం కాదు. అలాంటి పనులు చేయడం తప్పు. నాకు వీలైనంతవరకు విషయాన్ని అందంగా చూపించే ప్రయత్నమే చేశాను అని చెప్పారు ఓం రౌత్‌.

అయితే సినిమాలో ఏం చూపించాడు, ఎంత మేరకు లిబర్టీ తీసుకున్నాడు అనేది సినిమా వస్తే కానీ తెలియదు. మతవిశ్వాసాలు, నమ్మకాలు దెబ్బ తీయకుండా సినిమా చేస్తే చాలు. మరోవైపు పాన్‌ ఇండియా సినిమా ‘ఆదిపురుష్‌’తో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మంచి కథలు, కాంబినేషన్‌ కుదిరితే తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయడానికి కూడా నేను సిద్ధమే. ‘ఆదిపురుష్‌’ తర్వాత టాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను అని ఆశాభావం వ్యక్తం చేశారు ఓం రౌత్‌.

ఇక సినిమా విషయానికొస్తే… ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. కృతి సనన్‌ సీతగా నటిస్తున్న ఈ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపిస్తాడు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకొని సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తారు. అన్నట్లు ఈ సినిమా సుమారు ₹500 కోట్లు బడ్జెట్‌ కేటాయించారని టాక్‌.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus