Om Raut: ఆ రీజన్ వల్లే మోషన్ క్యాప్చర్ లో తెరకెక్కించామన్న ఓం రౌత్!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ టీజర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడగా తాజాగా విడుదలైన టీజర్ మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు. టీజర్ విషయంలో చాలామంది దర్శకుడిదే తప్పని కామెంట్లు చేస్తున్నారు. 100 సెకన్ల టీజర్ లో 10 తప్పులు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇతర భాషల ప్రేక్షకుల నుంచి సైతం ఈ టీజర్ గురించి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ మూవీకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వస్తున్నాయని ఓం రౌత్ అన్నారు. టీజర్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్ల వల్ల ఒక విధంగా నేను ధైర్యం కోల్పోయానని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. అయితే థియేటర్లలో చూడటం కోసం ఈ సినిమాను తీశామని మొబైల్ లో టీజర్ ను చూడటం వల్ల టీజర్ పై నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉండవచ్చని ఓం రౌత్ వెల్లడించారు. యూట్యూబ్ లో టీజర్ ను పెట్టకుండా చేయడం నాకు గంట పని అని ఓం రౌత్ అన్నారు.

అయితే టీజర్ ప్రేక్షకులందరికీ చేరువ కావాలనే అలోచనతోనే యూట్యూబ్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేశామని ఓం రౌత్ కామెంట్లు చేశారు. నా భాగస్వాములకు సంబంధించిన టీ సిరీస్ అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ అని ఆయన పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులకు సైతం నచ్చాలనే ఆలోచనతో ఆదిపురుష్ ను తెరకెక్కించామని ఆయన చెప్పుకొచ్చారు.

తర్వాత జనరేషన్ ప్రేక్షకులకు కూడా నచ్చాలనే ఆలోచనతోనే మోషన్ క్ప్యాప్చర్ విధానంలో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించామని ఓం రౌత్ అన్నారు. ఆదిపురుష్ సినిమా రిలీజ్ సమయంలో కూడా వివాదాలలో చిక్కుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఫుటేజ్ ను మెరుగుపరచటానికి చిత్రబృందం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus