ప్రేక్షకులకు సినిమా ఎలా ఉండబోతోంది, సినిమాలో ఏం ఉంటుంది? వంటి విషయాలు చెప్పాలి, చూపించాలి.. అప్పుడే వారు థియేటర్లకు వస్తారు. అంతేకానీ.. ఈ సినిమా కోసం ఇంతగా కష్టపడ్డాం.. ఇన్ని రోజులు అన్నం తినకుండా ఉన్నాం, ఇన్ని బాధలు పడ్డాం” అంటూ తమ పర్సనల్ విషయాలను మీడియాతోనూ, ప్రేక్షకులతోనూ పంచుకొంటే ఏం లాభమో దర్శకుడు ఓంకార్ కే తెలియాలి.
“రాజుగారి గది 3” ప్రమోషన్స్ లో భాగంగా గత కొన్ని రోజులుగా వరుస ప్రెస్ మీట్స్ పెడుతున్న ఓంకార్.. నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. “ఈరోజు నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం నా తమ్ముళ్లు. ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాం. నా కోసం వాళ్ల వృత్తిని కూడా త్యాగంచేశారు. వీళ్లకు నేను తప్పితే ఎవ్వరూ లేరు. లాస్ట్ ఇయర్ మా నాన్న చనిపోయారు. అప్పట్నుంచి వైట్ డ్రెస్ వేసుకుంటున్నారు. తమ్ముడ్ని హీరోగా చేసేంత వరకు వైట్ డ్రస్ విప్పను. ఛోటా కే నాయుడు నాకు దేవుడిచ్చిన అన్నయ్య. కుమార్ నాకు దేవుడిచ్చిన డిస్ట్రిబ్యూటర్” అని చెప్పుకొని కన్నీరు పెట్టుకొన్నాడు. ఇలా చేయడం వల్ల సినిమాకి ఏం ఒరుగుతుంది అనేది రేపు తెలుస్తుంది.