Allu Aravind: అల్లు అరవింద్ కి తిరుగులేదు అని ప్రూవ్ చేసిన ‘తండేల్’!

Ad not loaded.

అల్లు అరవింద్ (Allu Aravind)  … టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఈయన చాలా ఫేమస్. ఒక రకంగా టాలీవుడ్ ను ఏలుతున్న నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు అని చెప్పాలి. గతంలో ఎక్కువగా తమ మెగా హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కొన్నాళ్లుగా ‘జి ఎ 2 పిక్చర్స్’ ని స్థాపించి సహా నిర్మాతగా.. బన్నీ వాస్ తో  (Bunny Vasu) కలిపి మిగతా హీరోలతో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు.

Allu Aravind

ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంటుంది. అందుకే వీళ్ళ సినిమాలు మినిమమ్ గ్యారంటీ అన్నట్టు ఆడేస్తాయి. ఇటీవల ఈయన బ్యానర్ నుండి ‘తండేల్’ (Thandel)  సినిమా వచ్చింది. దీనికి మొదటి రోజు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా సరే సినిమాని బాగా ప్రమోట్ చేశారు అల్లు అరవింద్ అండ్ టీం. వారి ప్రమోషన్స్ కోసం పడ్డ కష్టం అంతా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తుంది.

మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా రెండో వీకెండ్ కి నిలబడటం కష్టం అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ‘లైలా’ (Laila)  ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) వంటి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి..! అందుకు తగ్గట్టే చాలా చోట్ల థియేటర్లు షేర్ చేయాల్సి వచ్చింది. కానీ ఊహించని విధంగా ‘లైలా’ ‘బ్రహ్మ ఆనందం’ సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చింది. అందువల్ల చాలా స్క్రీన్స్ మళ్ళీ ‘తండేల్’ కి వెళ్ళాయి. అందువల్ల రెండో వీకెండ్ ను కూడా ‘తండేల్’ బాగా క్యాష్ చేసుకుంది.

గతేడాది కూడా ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ‘తంగలాన్’ (Thangalaan) వంటి బడా సినిమాల పక్కన ‘ఆయ్’ (AAY) అనే చిన్న సినిమా వేశారు అల్లు అరవింద్. విచిత్రంగా ‘మిస్టర్ బచ్చన్’ ‘డబుల్ ఇస్మార్ట్’ ‘తంగలాన్’ సినిమాలకి మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. ‘ఆయ్’ కి కూడా సో సో అన్నట్టు టాక్ వచ్చింది. అయినప్పటికీ మిగిలిన 3 సినిమాల కంటే ‘ఆయ్’ బాగా ఆడింది. బ్రేక్ ఈవెన్ సాధించింది. అలా అల్లు అరవింద్ టైమింగ్ కి తిరుగులేదు అని ప్రూవ్ చేసినట్టు అయ్యింది.

బోల్డ్ కంటెంట్ ఎక్కువైతే డేంజరే.. న్యూ ట్రెండ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus