బోల్డ్ కంటెంట్ ఎక్కువైతే డేంజరే.. న్యూ ట్రెండ్!

టాలీవుడ్‌లో ట్రెండ్ అనేది ఏ సినిమా (Movies) హిట్ అయితే, వెంటనే అందరూ దానికే ఫాలో అవుతుంటారు. రొటీన్ కథలకు బదులుగా యూత్‌ఫుల్ కంటెంట్ ఉంటేనే కనెక్ట్ అవుతారని భావిస్తున్న కొంతమంది దర్శకులు, కథ పరంగా నాణ్యత కన్నా బోల్డ్ ఎలిమెంట్స్‌కే ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తున్నారు. కానీ ప్రేక్షకులు అలా అంత సులభంగా ఒప్పుకునే వారు కాదు. తాజాగా విడుదలైన లైలా లాంటి కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తుంటే, బోల్డ్ ఎలిమెంట్స్ ఎక్కువైతేనే సినిమా హిట్ అవుతుందన్న మైండ్‌సెట్ ఇప్పుడు పూర్తిగా ఫ్లాప్ అయ్యింది.

Movies

ఇప్పటివరకు కేవలం హిందీలోనే ఎక్కువగా ఉండే బోల్డ్ కంటెంట్, ఇప్పుడు తెలుగులో కూడా ఎక్కువగా కనపడుతోంది. ముందుగా ట్రైలర్ నుంచే ఓపెన్‌గా బూతు డైలాగులు, వల్గర్ సన్నివేశాలతో సినిమాలు ప్రమోట్ చేయడం మొదలైంది. అయితే, ఇది ఓ మలుపు తీసుకుంటోంది. కేవలం ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడానికి ఇలా చేసి ఉంటే, సినిమా ఆడటానికి మాత్రం అది సరిపోవడం లేదు. ఇటీవల విడుదలైన లైలా సినిమా ట్రైలర్‌కి మొదట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అసలు సినిమా చూసిన తర్వాత అందరూ నిరాశపడ్డారు.

ఒకప్పుడు బోల్డ్ డైలాగులు, డబుల్ మీనింగ్ కామెడీ సినిమాల్లో చాలా లిమిట్‌లో ఉండేది. కానీ ఇప్పుడు నేరుగా అసభ్యంగా మారుతున్నాయి. కొన్ని చిత్రాల్లో కథ, కథనం లేకుండా కేవలం షాకింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా నడిపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కేవలం ఓపెనింగ్స్ మాత్రమే వస్తాయి కానీ, ప్రేక్షకులు సినిమాను కంటిన్యూ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అసలు కథలో డెప్త్ లేకుండా కేవలం అట్రాక్షన్ కోసమే డైలాగులు ఉంటే ప్రేక్షకులు కట్టిపడిపోరన్న విషయం అర్థం కావాలి.

ఇలాంటి సినిమాలకు (Movies) ప్లాట్‌ఫార్మ్ ఇచ్చే ప్రయత్నం గతంలో జబర్దస్త్ లాంటి షోల ద్వారా కనిపించింది. కానీ అవి పూర్తిగా టీవీ ఆడియన్స్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. సినిమాల్లో అయితే అదే కంటెంట్ ప్రేక్షకులకు నచ్చడం లేదు. ఒక మోస్తరు ప్రేక్షకులను టార్గెట్ చేయడం వల్ల ఓ క్లాస్ ఆడియన్స్ పూర్తిగా మిస్ అవుతున్నారు. ఇది నిర్మాతలు, డైరెక్టర్లకు గుణపాఠం అయ్యేలా ఉంది.

సినిమాలు (Movies) ప్రేక్షకులను ఆకర్షించాలంటే కేవలం బోల్డ్ కంటెంట్‌పై ఆధారపడడం సరికాదు. కథలో బలం ఉంటేనే సినిమా నిలబడుతుంది. రీసెంట్‌గా వచ్చిన కొన్ని సినిమాలు వరుసగా బోల్డ్ ఎలిమెంట్స్‌తోనే హిట్ కావాలని ప్రయత్నించాయి. కానీ ప్రేక్షకులు వాటిని పూర్తిగా తిరస్కరించారు. ఇప్పటికైనా ట్రెండ్ పేరుతో మారుతున్న ఈ పద్ధతికి ఓ గట్టి గుణపాఠం లభించిందనే చెప్పాలి.

దిల్ రాజు కాంపౌండ్ లో రావిపూడి ఆయుధాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus