సెకండ్ సినిమాతోనైనా హీరోగా సెటిల్ అవుతాడా?

కొందరికి ఫేమ్, టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకో సక్సెస్ మాత్రం సొంతమవ్వదు. ఆ లిస్ట్ లో యాంకర్ రవి ముందు వరుసలో ఉంటాడు. మనోడు టీవీల్లో చేస్తున్న షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకొన్నప్పటికీ.. హీరోగా చేసిన తొలి సినిమాతోపాటు డిజాస్టర్ అందుకొన్నాడు. “ఇది నా ప్రేమ కథ” అనే టైటిల్ తో రూపొందిన ఆ చిత్రం విడుదలైన విషయం రవి ఫ్యాన్స్ లో సగం మందికి కూడా తెలియదు. అయితే.. కొన్నాళ్ళ విరామం అనంతరం రవి మళ్ళీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడు.

తమిళంలో మంచి హిట్ కొట్టిన “మందసుపట్టు” అనే సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో రవి హీరోగా నటిస్తున్నాడు. ఈ కామెడీ సినిమా రెట్రో మూవీగా తెరకెక్కుతోంది. కెమెరాకీ భయపడే ఓ ఊరి జనాల నేపధ్యంలో సాగే సినిమా ఇది. లాజిక్స్ ఉండవు కానీ.. సరిగ్గా తీయగలిగితే మంచి కామెడీ ఎంటర్ టైనర్ అవ్వగల సత్తా ఉన్న సినిమా అది. మరి రవికి ఈ సెకండ్ సినిమా అయినా హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. ఆల్రెడీ 80% చిత్రీకరణ పూర్తిచేసుకొన్న ఈ చిత్రం ఫస్ట్ మరియు ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, సినిమాకి దర్శకుడు ఎవరు అనేది అప్పుడే తెలుస్తుంది. తమిళ వెర్షన్ లో “ఎక్కడికి పోతావు చిన్నవాడా” ఫేమ్ నందిత శ్వేత కథానాయికగా నటించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus